బాలయ్య 64వ పుట్టినరోజు – హిందూపురంలో వేడుకలు

హిందూపురం (శ్రీ సత్యసాయి) : నేడు నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజును పురస్కరించుకొని హిందూపురంలోని బాలయ్య అభిమానులంతా వేడుకలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టిడిపి కార్యకర్తలు, అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు వేదపండితుల ఆశ్వీరచనాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతనియోజకవర్గంలో అభిమానుల వద్ద ఆయన జన్మదిన వేడుకలు చేసుకున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పూజలు నిర్వహించారు.

➡️