Hero Jr. NTR – తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి : హీరో జూ.ఎన్టీఆర్‌

తెలంగాణ : ” డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి.” అని టాలీవుడ్‌ హీరో జూ.ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు డ్రగ్స్‌ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా బుధవారం ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

” మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్‌ కోసమో.. మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్‌ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు సమాచారం అందించండి ” అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

➡️