‘భజే వాయు వేగం’ పోస్టర్‌ విడుదల

Apr 12,2024 19:20 #karthikeya, #movie

యువి క్రియేషన్స్‌ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో మహేష్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని ఆయన అభినందించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్‌గా ఐశ్వర్య మీనన్‌ నటిస్తున్నారు. రాహుల్‌టైసన్‌ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజరుకుమార్‌ రాజు పి., కోప్రొడ్యూసర్‌గా ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కో ప్రొడ్యూసర్‌గా అజరు కుమార్‌ రాజు వ్యవహరిస్తున్నారు. క్రికెట్‌బ్యాట్‌తో హీరో కార్తికేయ పరుగులు పెడుతుండటం, మరోవైపు పెద్దమొత్తంలో డబ్బు ఎగరటం కనిపిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

➡️