‘దండోరా’ చిత్రంలో బిందుమాధవి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పలు చిత్రాలలో నాయికగా నటించిన బిందు మాధవి ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్టు రవీంద్ర బెనర్జీ చెప్పారు.
