ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయాలయ్యాయి. ఆయన భుజానికి, కాలికి ఫ్రాక్చరై.. చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభారు అంబానీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రముఖ దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్గా జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై భారీ అంచనాల్ని పెంచింది. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది.
