ముంబయి : బాలివుడ్ నటి, మోడల్ పూనమ్ (32) గర్భాశయ క్యాన్సర్‌తో గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని పూనమ్ టీంవారు ధ్రువీకరించారు. ” ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాము ” అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పూనమ్ టీం పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పూనమ్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే.. 2013లో ‘నాషా’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందారు.
