‘లైలా ఈవెంట్‌లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్‌సేన్ వస్తాడు. పరిచయం చేయకపోయినా సరే పిలిస్తే సపోర్ట్‌చేస్తాడు. మా బాపు ఈవెంట్‌కు వచ్చి గంటర్నర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్‌లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు’ అని నటుడు బ్రహ్మాజీ ఖండించారు. ప్రస్తుతం బ్రాహ్మాజీ ‘బాపు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దయ దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదల కానుంది. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై సిహెచ్ భానుప్రసాద్‌రెడ్డి నిర్మించారు.
