ఈ ఎండల్లో మన తెలుగు హీరోలు షూటింగుల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ చిత్రం అజీజ్‌నగర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ‘అఖండ 2’ కోసం ఆర్‌ఎఫ్‌సీలో వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు భాను భోగవరపు సినిమా కోసం జాన్‌వాడలో షూటింగ్‌తో రవితేజ బిజీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. అలాగే తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న ‘మిఠారు’ మూవీ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘తెలుసు కదా’ షూటింగ్ బాచుపల్లిలో జరుగుతోంది. నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ఇలా పలు చిత్రాలు వివిధ ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
