సురేష్‌ ప్రొడక్షన్స్‌ సెలబ్రేటింగ్‌ 60 గ్లోరియస్‌ ఇయర్స్‌

May 21,2024 17:46 #New Movies Updates

పద్మ భూషణ్‌, మూవీ మొఘల్‌, లెజెండరీ డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ అరవై ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించి ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి సంస్థగా అరుదైన ఘనత సాధించింది. 1964లో ప్రారంభమై, ఎన్నో కల్ట్‌ క్లాసిక్‌ హిట్స్‌, మోడరన్‌ మాస్టర్‌ పీస్‌ చిత్రాలతో గత ఆరు దశాబ్దాలుగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ పంచుతోంది.
సురేష్‌ ప్రొడక్షన్స్‌ 60ఏళ్ళు పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ అద్భుతమైన సినీ ప్రయాణంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.

➡️