చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథిగా చిరంజీవి

Jun 11,2024 19:05 #Megastar Chiranjeevi, #movie

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరుకావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ రానున్నారు. అక్కడ బుధవారం ఉదయం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామ్‌ చరణ్‌ కూడా హాజరుకానున్నారు. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ జనసేనకు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం చిరంజీవి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

➡️