రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం విడుదల వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ముందు ప్రకటించినట్లు ఈ ఏడాది క్రిస్మస్‌కే ఈ సినిమా విడుదలవుతుందని వెల్లడించారు. ‘సినిమా షూటింగ్ పూర్తయింది. రామ్ చరణ్, శంకర్ ఇమేజ్‌ను ఈ సినిమా మారుస్తుంది. మంచి విజయం అందుకుంటుంది. పొలికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని దిల్ రాజు అన్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
