సమాజంలో మార్పు కోసమే ‘సిఎం పెళ్లాం’ : రమణారెడ్డి, రామకృష్ణ

May 7,2025 17:28 #movies

‘ఎమ్మెల్యే…సిఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్‌ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? సినిమా తర్వాత ఈ ప్రశ్నను మేము అడుగుతున్నాం. కనీసం ఈ సినిమా తర్వాతైనా అది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎమ్మెల్యేగా కాస్త బిజీగా ఉండి బయట తిరుగు తున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులకు ఎమ్మెల్యే పెళ్లాం కాస్త రెండు, మూడు గంటలు కేటాయించి పనిచేస్తే చాలా మార్పొస్తాయని నమ్మం. ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ కలిస్తే చాలు మార్పొస్తుందని ఈ సినిమాలో చూపించాం’ అని చిత్ర నిర్మాత దర్శకులు బొల్లా రామకృష్ణారెడ్డి, గడ్డం రమణారెడ్డి, రామకృష్ణ అన్నారు. ఇంద్రజ, అజరు జంటగా నటించిన చిత్రం ‘సిఎం పెళ్లాం’. బొల్లా రామకృష్ణారెడ్డి (బీఆర్‌కే) నిర్మించిన ఈ సినిమాను గడ్డం రమణారెడ్డి తెరకెక్కించారు. ఈనెల తొమ్మిదో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. హైదరా బాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

➡️