కొలంబొకు ‘డ్రాగన్‌’

Mar 10,2025 19:06 #movies, #NTR, #Prashanth Neel

ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్‌’. ఇది ప్రచారంలో ఉన్న టైటిల్‌. పీరియాడికల్‌ మూవీగా తెరకెక్కుతోంది. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. ఫిబ్రవరి 20న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనలేదు. తాజా షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. శ్రీలంక రాజధాని కొలంబొలో ఈ షూటింగ్‌ జరగనుంది. ఇప్పటికే యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు అక్కడికి వెళ్లి షూటింగ్‌ ప్రదేశాలను పరిశీలించి వచ్చారు. కళ్యాణ్‌రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.

➡️