హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యారాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ నటించారు. పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యారాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీచౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ‘ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో 90 శాతం సినిమా పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ కూడా ప్రారంభించాం’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో.