నటి, నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయికుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ టీజర్‌ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘యువతైనా, పెద్దవాళ్లైనా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బాగుందని అనుకుంటారు. ఎలాంటి పొరపొచ్చాలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
