నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కానుంది. చిత్ర మేకర్లు ట్రైలర్‌ను శుక్రవారంనాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటులు కనిపించినా వారు నటించిన తీరు చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ట్రైలర్‌లో ఎక్కువగా స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ చక్కగా చూపించారు. చూపించారు. ప్రతి గ్రామంలో ఇలాంటి ‘కమిటీ కుర్రోళ్లు’ తప్పకుండా ఉంటారు అనేలా ట్రైలర్ ఉంది.
