తెలంగాణ : కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ”ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్ కు నా హృదయపూర్వక అభినందనలు” అని పోస్టులో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఆదివారం ఈ పార్టీ తొలి మహానాడు జరిగింది. తన పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశించి విజయ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ”ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజరుగా ఇక్కడ నిలబడ్డా.” అని అన్నారు.