‘డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో మీకు తెలుసు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్‌ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్‌గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్‌టైమ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్‌ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్‌ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్‌లతోపాటు సింగర్ జానులైరి, ప్రకృతి, మానస్, దీపిక ఉంటారు. ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్‌లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు’ అని హోస్ట్ ఓంకార్ అన్నారు. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా సీజన్ 2 వైల్డ్‌ఫైర్ ఈనెల 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ షోకు ఓంకార్, కథానాయిక ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్‌లు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. సీజన్ 2లో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. హిప్‌హాప్, క్లాసికల్ కాంటెంపరరీ స్టైల్స్‌లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతోపాటుగా మిగతా హోస్ట్‌లు, మెంటార్లు మాట్లాడారు.
