విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రఖ్యాత దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలను హైదరాబాద్‌లో గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కూటికుప్పల సూర్యారావుకు ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డును అందజేశారు. గత రెండు దశాబ్దాలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా సూర్యారావు ఎయిడ్స్ నివారణకు చేస్తున్న కృషిని, ఇతర సామాజిక సేవారంగాల్లో అందిస్తున్న సేవలను వెంకయ్య నాయుడు అభినందించారు.
