కల్కిలో దీపికా డబ్బింగ్‌ పూర్తి

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. హీరోయిన్‌ దీపికా పదుకొనే తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 27న విడుదల కానుంది. ‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని దీపికా పదుకొనే పూర్తి చేశారు. హిందీ, కన్నడ భాషల్లో ఆమె డబ్బింగ్‌ చెప్పినట్లు సమాచారం.

➡️