మూడు సినిమాలతో బిజీగా ఉన్నా: శ్రీకాంత్‌ గేదెల

Jan 11,2025 12:39 #busy, #Srikanth Gedela, #three films

‘ప్రస్తుతం నేను గుట్టుచప్పుడు, మెగాపవర్‌, హనీమూన్‌ వంటి సినిమాల షూట్‌లో ఉన్నా. గత కొన్నేళ్లుగా సినిమారంగంలో అపారమైన అనుభవం ఉంది. అందువల్ల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలను చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నా. సినిమాల్లో కెమెరామెన్‌ పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు నేను న్యాయం చేయగలుగుతున్నా. అందువల్ల నాకు కొత్త అవకాశాలను దర్శకులు, నిర్మాతలు, నటీనటుల ద్వారా అందుతున్నాయి’ అని సినీ కెమెరామెన్‌ శ్రీకాంత్‌ గేదెల అన్నారు. ‘గుట్టుచప్పుడు’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

➡️