గాయపడినా..’కేన్స్‌’ వేడులకు ఐశ్వర్యరాయ్

May 16,2024 20:08 #iswarya, #New Movies Updates

గతకొన్నేళ్లుగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ హాజరవుతున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈనెల 14న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్‌ తరపున పాల్గొనేందుకు ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు ప్రయాణమయ్యారు. విమానాశ్రయంలో ఆమెకు పలువురు వీడ్కోలు పలికారు. ఆమె తన కుడి చేతికి ఆర్మ్‌ స్లింగ్‌ ధరించి ఉన్నారు. ఆమె చేతికి గాయమైనట్లుగా సమాచారం. 2002 నుంచి ఆమె వరుసగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు భారత్‌ తరపున హాజరవుతున్న విషయం తెలిసిందే. ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోభితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా ఈసారి వేడుకల్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్‌లో పింక్‌ లుక్‌లో కనిపించారు.

➡️