నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాను వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, దేవదత్తా స్వామి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన పోస్టరును చిత్రబృందం విడుదలచేసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల వాయిదా పడి మార్చి 28న థియేటర్లలోకి రానుంది.
