19న దేవర ‘ఫియర్‌ సాంగ్‌’ విడుదల

May 16,2024 20:11 #jr ntr, #movies, #song release
devara agamanam updates

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఇది సీక్వెల్‌గా రెండు భాగాలుగా రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయుకగా, బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో, నరైన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఈనెల 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌ లిరిక్‌కు సంబంధించి డేట్‌ను ప్రకటించారు. ఫస్ట్‌ సింగల్‌ను ఫియర్‌ సాంగ్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

➡️