ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌ రాజు

Feb 4,2025 10:10 #dil raju, #IT office

తెలంగాణ : సినీ నిర్మాత దిల్‌ రాజు మంగళవారం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేసిన సంగతి విదితమే. ఆయన వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు దిల్‌ రాజుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్‌ స్టేట్‌ మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా దిల్‌రాజు భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదల చేయడంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. దిల్‌ రాజుతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగిన విషయం విదితమే.

➡️