‘చిత్ర పరిశ్రమలో కొత్తవారిని, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ‘దిల్‌రాజు డ్రీమ్స్’ అనే సంస్థను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, రచయితలు… ఇలా ఆసక్తి ఉన్న మా టీమ్‌ని సంప్రదించొచ్చు. ఇందుకోసం నా బర్త్‌డే (డిసెంబర్ 18) లేదా జనవరి 1న వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తాం. ఇండిస్టీలో చాలా చిత్రాలు వస్తున్నాయి. పోతున్నాయి. అయినా కూడా ఎవరికీ తెలియటం లేదు. ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుసు. అందుకే ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయాలి. ప్రతిభ ఉన్న కొత్తవారికి సరైన వేదిక ఉండాలని ఈ సంస్థను స్థాపించా. ఇప్పటికే ఇద్దరు ఎన్నారైలు మా సంస్థ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ సంస్థ కార్పొరేట్ స్టెయిల్‌లో ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారందరికీ జీతాలిస్తాం. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాం. వాటిలో ఖచ్చితంగా రెండైనా హిట్ కావాలని షరతు విధించాం. మంచి ప్రతిభావంతులకు నా బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సిఫారసులు ఉండవు. అందరూ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించాలి’ ‘ అని నిర్మాత్ ‘దిల్’రాజు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ లోగోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ పై విషయాలను ప్రస్తావించారు.
