నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరోను పరిచయం చేయబోతున్నా : దర్శకుడు వైవీఎస్‌.చౌదరి

తెలంగాణ : నందమూరి కుటుంబం నుంచి మరో హీరో సినీ ఇండిస్టీకి పరిచయం కాబోతున్నారని దర్శకుడు వైవీఎస్‌.చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. ” సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండిస్టీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా ” అని వైవిఎస్‌ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇందులో తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. మరో ఈవెంట్‌ పెట్టి హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.

➡️