స్వల్పంగా క్షీణించిన విజయ్ కాంత్ ఆరోగ్యం

Nov 29,2023 17:31 #health, #movie, #Vijayakanth

 

చెన్నై : ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (డిఎండికె) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ధోపెడిక్స్‌ అండ్‌ ట్రామాటాలజీ (ఎంఐఓటి) ఆసుపత్రి వెల్లడించింది. ఈ మేరకు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎంఐఓటి ఆసుపత్రి బుధవారం హెల్త్‌బులెటెన్‌ను విడుదల చేసింది. ‘గడచిన 24 గంటల్లో విజయ్ కాంత్ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించింది. ఆయనకు మరింత చికిత్సనందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయనకు పల్మనరీ సపోర్ట్‌ అవసరం ఉంది. ఆయన త్వరగా కోలుకుంటారనే నమ్మకం ఉంది. మరో 14 రోజులపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.’ అని ఎంఐఓటి ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

➡️