బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దో పత్తి’. కృతి డ్రీమ్ ప్రాజెక్టుగా బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. కృతిసనన్ పదేళ్లుగా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఆమె నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు. ఈనెల 25 నుంచి ‘దో పత్తి’ సినిమా నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారికంగా మేకర్లు ఇప్పటికే ప్రకటించారు. హిందీతోపాటుగా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్‌వాలే సినిమాలో కృతిసనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ‘దో పత్తి’ సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు.
