రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘స్టెప్పా మార్..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా మాస్ డాన్స్ చేస్తున్న రామ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అందించారు. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజరుదత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
