నేడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్‌ విడుదల

May 15,2024 02:13 #New Movies Updates, #teaser

హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌'(2019) మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సంజరు దత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. బుధవారంనాడు రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రామ్‌ సరికొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఫేస్‌ మాస్క్‌, పులి చారల చొక్కా, టోర్న్‌ జీన్స్‌ ధరించి ఒక చేతిలో సిగరెట్‌, మరో చేతిలో క్రాకర్స్‌ పట్టుకుని ఇంటెన్స్‌ లుక్‌తో కనిపించారు రామ్‌.

➡️