శివసాయి బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై శివరామ్ హీరోగా సౌమ్య, వీరంకి వెంకటనరసింహారావు, రామకృష్ణ, రంగనాయకులు, బాలచందర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డాక్టర్ విశ్వామిత్ర’. విజయవాడకు సమీపంలోని మైలవరం మండలం బర్రగూడెంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ సమేత గోపయ్య దేవస్థానంలో షూటింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు (గాంధీ) క్లాప్ కొట్టారు. డైరెక్టర్ సాయి వెంకట్, కో డైరెక్టర్లు బాలచందర్, భార్గవ్ ముహూర్తం షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ శివరామ్ హీరోగా నిర్మితమవుతున్న ‘డాక్టర్ విశ్వామిత్ర’ చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. నటనలో అపారమైన అనుభవం ఉన్న శివరామ్ ద్వారా ఈ ప్రాంతానికి చెందిన నటీనటులంతా ఈ సినిమాలో నటిస్తుండటం ఎంతో సంతోషకరమన్నారు. డాక్టర్ విశ్వామిత్ర సినిమా ఖచ్చితంగా హిట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం తనకు ఇప్పుడే కల్గిందన్నారు. జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బలియశెట్టి శ్రీకాంత్, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య తదితరులు పాల్గన్నారు. ఎడిటర్ షణ్ముక్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. బిగ్‌బ్యాంగ్ శ్రీనివాస్ సహకారాన్ని అందించారు. సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు హాజరయ్యారు.
