తేజ్ నటిస్తూ కన్నడ- తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ఫుట్‌బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్‌బాల్ ప్రేమికుడైన కీర్తిశేషులు కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఏమిటో మాయ మంత్రమే… మది జింకలా పరిగెత్తేనే’ పాట అటు కన్నడలోనూ, ఇటు తెలుగులో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో ఎస్‌పి మనోహర్ రాసిన ఈ గీతాన్ని అభిషేక్ ఆలపించారు. ఎమిల్ మహమ్మద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రంగాయన రఘు ఫుట్‌బాల్ కోచ్‌గా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలిపాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్థగౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష, రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.