‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఆమె రచన, దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా మరోసారి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్‌ తెలిపింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ముందుగా జూన్‌ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. బీజేపీ నుంచి ఆమె హిమాచల్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.

➡️