అన్నమయ్య : అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి జరిగిన సంగతి విదితమే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్‌బాబును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ …. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈక్రమంలో … పవన్‌ని చూడటానికి అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాతో పవన్ మాట్లాడుతున్న సమయంలో ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో పవన్ మండిపడ్డారు. ”ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి” అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. పవన్ తన తదుపరి చిత్రాలు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు పాల్గంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ను అక్కడి అభిమానులు స్లోగన్ చేశారు.
