డిసెంబర్‌ 14న ‘ఫియర్‌’ విడుదల

Nov 26,2024 20:45 #movies, #new movie poster, #released

నటి వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఫియర్‌’. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ డాక్టర్‌ వంకి పెంచలయ్య, ఎఆర్‌ అభి నిర్మిస్తున్నారు. సుజాతరెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకురాలు డాక్టర్‌ హరిత గోగినేని ఈ సినిమా రూపొందిస్తున్నారు. అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డులను గెల్చుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. డిసెంబర్‌ 14న సినిమాను విడుదల చేస్తామని మేకర్లు మంగళవారంనాడు ప్రకటించారు. ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టీజర్‌ విడుదల చేయగా సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండింగ్‌ అయ్యింది. జయప్రకాష్‌ (జెపి), పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురువిల్ల, సాయాజిషిండే, సత్యకృష్ణ, సాహిత దాసరి, షాని తదితరులు నటిస్తున్నారు.

➡️