ఫియర్‌ ట్రైలర్‌ విడుదల

Dec 9,2024 18:43 #Fear trailer, #movies, #released

నటి వేదిక లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ఃఫియర్‌ః. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్లు డాక్టర్‌ వంకి పెంచలయ్య, ఎఆర్‌ అభి నిర్మిస్తున్నారు. సుజాతరెడ్డి కోప్రొడ్యూసర్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకురాలు డాక్టర్‌ హరిత గోగినేని రూపొందిస్తున్నారు. అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు. ట్రైలర్‌ను నటుడు మాధవన్‌ ఆవిష్కరించారు. ఃట్రైలర్‌ చాలా చక్కగా వచ్చింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. కచ్చితంగా విజయం సాధిస్తుందిః అని మాధవన్‌ అన్నారు. అనూప్‌ రూబెన్స్‌ అందించింది బీజీఎం, ఐ ఆండ్రూ విజువల్స్‌ బాగా వచ్చాయి. ఈనెల 14న ఈ సినిమా విడుదల కానుంది. జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురవిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటిస్తున్నారు.

 

➡️