సీరత్‌ కపూర్‌ డబ్బింగ్‌కు ఫిదా

Jun 10,2024 20:30 #NEERAB KAPOOR, #New Movies Updates

తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా వున్న నటీమణు ల్లో సీరత్‌ కపూర్‌ ఒకరు. ఇటీవల విడుదలైన సినిమా ‘మనమే’లో సీరత్‌ కపూర్‌ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమాలో శర్వానంద్‌ బెలూన్‌ ఫెస్టివల్‌కి బ్రస్సెల్స్‌ వెళ్ళినప్పుడు అక్కడ గైడ్‌గా సీరత్‌ కపూర్‌ పరిచయమవుతారు. ఆమెతో ఒక పాటని కూడా పెట్టారు. సినిమాలో రెండో సగంలో ఆమె పాత్ర ఉంది. అయితే ఈ పాత్ర కోసం సీరత్‌ తెలుగులో తన స్వంత గొంతు ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర విదేశాల్లో వున్న గైడ్‌గా ఉంటుంది కాబట్టి, తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెపితే బాగుంటుందని నిర్వాహకులు కోరగా ఆమె ఒప్పుకుంది. సినిమాలో ఈ డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయని బయట బాగా టాక్‌ నడుస్తోంది.

➡️