రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. జనవరి 10న సినిమా రిలీజైంది. అంటే ఇంకా నెలరోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
