గేమ్‌ ఛేంజర్‌ ‘నానా హైరానా..’ పాట లేదు

రామ్‌ చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా థియేటర్లలో జనవరి 10న విడుదలైంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, కియారా మధ్య తెరకెక్కించిన ‘నానా హైరానా..’ అనే పాటని ప్రదర్శించడంలేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. సాంకేతిక వైఫల్యం వల్ల ఈ పాటను ఫైనల్‌ కాపీలో కలపలేదని నిర్మాతలు తెలిపారు. ఈ పాటని కార్తీక్‌, శ్రేయ ఘోషల్‌ పాడారు. రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటను జనవరి 14 నుంచి సినిమాలో యాడ్‌ చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలో చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నానా హైరానా’ తెరకెక్కింది.

➡️