‘గేమ్‌ ఛేంజర్‌’ పైరసీ ప్రసారం – నిందితులు అరెస్టు

విశాఖ : ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్‌ నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. దీని పైరసీ కాపీని ఏపీలోని ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక పోలీసులు, సైబర్‌ క్లూస్‌ టీం కలిసి ఆ టీవీ ఛానల్‌ పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పలువురిని అరెస్టు చేశారు.

➡️