‘గేమ్‌ఛేంజర్‌’ విడుదల ఎప్పుడో?

Oct 10,2024 23:20 #moives, #ramcharan

హీరో రామ్‌చరణ్‌ నటించిన సినిమా ‘గేమ్‌ఛేంజర్‌’. ఈ సినిమా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని ఆ సినిమా మేకర్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే పలుసార్లు ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు ఇండ్రస్టీలో చక్కెర్లు కొడుతున్నాయి. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ మళ్లీ ‘గేమ్‌ ఛేంజర్‌’ వాయిదా పడితే సంక్రాంతి బరిలోకి దిగుతుందనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇదే జరిగితే వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.

➡️