గామి, తంగలాన్‌కు అరుదైన గౌరవం

Feb 1,2025 23:41 #Gami, #movies, #rare honor, #Tangalan

గతేడాదిలో విడుదలైన రెండు దక్షిణాది సినిమాలైన తెలుగులో గామి, తమిళ మూవీ తంగలాన్‌కు మంచి విజయంతో అరుదైన గౌరవాన్ని అందుకున్నాయి. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌ 2025కు ఈ రెండు చిత్రాలు అధికారికంగా ఎంపికయ్యాయి. ఈమేరకు అధికారికంగా ఇరు సినిమాల నిర్మాతలు ప్రకటిం చారు. ఈనెల తొమ్మిదోతేదీన జరగనున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాలను ప్రదర్శించను న్నారు. నెదర్లాండ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారత సినిమాలకు చోటు దక్కడంతో నెట్టింటి ఫ్యాన్స్‌ అభినందనలు తెలుపుతున్నారు. విశ్వక్‌ సేన్‌, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’. వి సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్లపాటు షఉటింగ్‌ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా నటించడం విశేషం. టాక్‌ పరంగా పాజిటివ్‌ వచ్చినప్పటికీ డిఫరెంట్‌ మూవీస్‌ ఇష్టపడే ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్‌ అయ్యారు. తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌, దర్శకుడు రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం తంగలాన్‌. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

➡️