విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదలైంది. కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక సాధారణ యువకుడు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్‌ను ఎదిరించడమే కాకుండా చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఉండబోతోంది. మొదట పాటల రచయితగా ఇండిస్టీలో మంచి గుర్తింపును అందుకున్న కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. మే 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
