‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ విడుదల

Apr 3,2024 19:25 #Geetanjali, #movie

అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ చిత్రం ట్రైలర్‌ చిత్ర నిర్మాతలు బుధవారం విడుదల చేశారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థల ఆధ్వర్యంలో శివ తుర్లపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో టైటిల్‌ రోల్‌ పాత్రను పోషిస్తున్న అంజలికి ఇది 50వ సినిమా. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్‌, ఆలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్‌ చెప్పారు.

➡️