‘రిషభ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ కాంబినేషన్లో ‘కాంతారా : చాప్టర్-1’ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఇటీవల విడుదలైన నా చిత్రం ‘మంగళవారం’లో నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మీరు కాస్త సమయం వెచ్చించి నేను నటించిన సినిమా చూస్తే, మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులకు నా ధన్యవాదాలు’ అని పాయల్ రాజ్‌పుత్ ట్విట్టర్ వేదికగా ‘కాంతార : చాప్టర్-1’ చిత్ర బృందాన్ని కోరారు.
