బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్‌ విడుదల

Jun 10,2024 20:33 #Balakrishna, #New Movies Updates

నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో ఎన్‌బికె 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్ట్యూన్‌ ఫోర్‌ బ్యానర్స్‌ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌. గతేడాది చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్‌ బాబీ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు బాబీ మరో ఛాన్స్‌ ఇచ్చారనేది సమాచారం. చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

➡️