చిత్ర పరిశ్రమకు మంచిచేయండి

Jun 8,2024 17:26 #cinema
  • ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్య మండలి విజ్ఞప్తి

‘సినిమా పరిశ్రమ నుంచి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన హీరోలైన ఎమ్మెల్యేలు కె.పవన్‌కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణలకు అభినందనలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అందువల్ల మీరు స్పందించి పరిశ్రమను మంచి చేయాలని కోరుతున్నాం’ అంటూ ఓ లేఖను ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఎఎం రత్నం, ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్‌గౌడ్‌ విడుదల చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, ఎపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత, సినీ నిర్మాత రామోజీరావు మృతిపట్ల ఎఎం రత్నం, జె.వి.మోహన్‌గౌడ్‌ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. 

➡️