Grammy award : భారత సంతతి గాయనిని వరించిన గ్రామీ అవార్డ్‌

ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన గ్రామీ అవార్డు భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ను వరించింది. ఫిబ్రవరి 2వ తేదీన లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా 67వ గ్రామీ అవార్డ్స్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చంద్రికా టాండన్‌ ఈ గ్రామీ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాల్గొని సందడి చేశారు.
కాగా, చంద్రికా టాండన్‌ రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్‌ ఆర్‌ చాంట్‌ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఈమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్‌ వరించింది. ఈమె పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రా నూయీకి చంద్రిక సోదరి అవుతారు. ఈమె చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఎక్కువ. తల్లి సంగీత విద్వాంసురాలు. దీంతో ఈమె తల్లి దగ్గరే సంగీతం శిక్షణ తీసుకున్నారు.

➡️