మంచి నటుడిగా గుర్తింపుకోసమే ఆరాటం : గూడ రామకృష్ణ

70కి పైగా చిత్రాల్లో నటించిన గూడ రామకృష్ణ దాసరి నారాయణరావు దగ్గర ‘మజ్ను’ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సన్నజాజి, పెళ్ళాం వచ్చింది. జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సినిమాలు తీశారు. ఇది జాతీయ సమగ్రతా చిత్రంగా 2009లో ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా సరోజినీనాయుడు స్మారక నంది పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా పుష్ప 2, గేమ్‌ ఛేంజర్‌, రాజా సాబ్‌, తమ్ముడు, భైరవం వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంచి నటుడిగా గుర్తింపు కోసమే ఆరాటం’ అన్నారు.

➡️